నిజామాబాద్, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛభారత్ గ్రామీణ్ టు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం మాక్లుర్ మండలంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విటల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త వేరు చెయ్యాలని, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రంగా ఉంచడానికి గ్రామస్థాయిలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అదేవిధంగా ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్ హాజరై మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో మురుగునీటి నిర్వహణ సరైన క్రమంలో నిర్వహించుకోవాలని, దీనికి సంబంధించి వ్యక్తిగత ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడానికి డంపింగ్ షెడ్ పూర్తిస్థాయిలో నిర్వహించుకోవాలన్నారు.
కొత్తగా ఏర్పాటైన కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మాక్లూర్ ఎంపీడీవో క్రాంతి, వైస్ ఎంపీపీ సుక్కి సుజాత, వివిధ గ్రామపంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, మాక్లూరు ఎంపీఓ శ్రీనివాస్, శిక్షణ కార్యక్రమం ఇవ్వటానికి వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్స్ సంతోష్ కుమార్, సుభాష్ చంద్రబోస్, అశోక్, రాజు, రాంబాబు, ఉపాధి హామీ ఏపీఓ ఓంకార్, ఐకెపి ఎపిఎం, వివిధ గ్రామపంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీలు, గ్రామ సంఘం అధ్యక్షులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.