రెంజల్, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సర్పంచ్ మధురబాయి అన్నారు. గురువారం మండలంలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో విశ్వ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా నీలీ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.అనంతరం సర్పంచ్ మతురాబాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అంబేద్కర్ సూచించిన అడుగుజాడలు నడిచినప్పుడే ఆయన ఆశయ సాధనకు కృషిచేసిన వారమవుతామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తెలివితో జ్ఞానంతో మహా రాజ్యాంగాన్ని రాసి దేశానికి దశాదిశ మార్గ నిర్దేశం చేసిన మహా మేధావి అంబేద్కర్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు సమాజంలో స్వేచ్ఛగా బతుకుతున్నామని రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆమె అన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 31 వరకు గ్రామ గ్రామాన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముసా, వసంత్ ఖంబ్లే, సూర్యకాంత్, సుమన్, భగవాన్ తదితరులు ఉన్నారు.