రెంజల్, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత సంవత్సరం కాలం నుంచి గ్రామ పంచాయతీకి ప్రతి నెల రావాల్సిన పంచాయతీ నిధులు సంవత్సరం నుండి రావడంలేదని నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రెంజల్ మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు మర్లషికారి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రెంజల్ మండల సర్పంచ్ పోరంతో పాటు జిల్లా సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుకు వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి గ్రామపంచాయతీకి రావాల్సిన నిధులు రాకపోవడంతో సర్పంచులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తాము ఖర్చు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో సర్పంచులు సాయరెడ్డి, సాయిలు, గణేష్, లింగం, విజయ్, బాబునాయక్, నర్సయ్య, కశం సాయిలు, రాఘవేందర్, కిష్టయ్య, సాయరెడ్డి తదితరులు ఉన్నారు.