కామారెడ్డి, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జెడ్పి సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రజా ప్రతినిధులు చూడాలని తెలిపారు.
గ్రామపంచాయతీ, ఉపాధి హామీ, వైద్యం, తాగునీరు, పౌర సరఫరా, అటవీశాఖ, విద్యుత్తు, వ్యవసాయ శాఖలపై సమీక్ష నిర్వహించారు. జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని జెడ్పీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని కోరారు. సభ్యులు తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఎఫ్‌ఓ నిఖిత, జెడ్పి సీఈవో సాయా గౌడ్, సిపిఓ రాజారాం, డిపిఓ శ్రీనివాసరావు, డిఆర్‌డివో సాయన్న, జెడ్పిటిసి సభ్యులు మనోహర్ రెడ్డి, తిరుమల్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీలత, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.