కామరెడ్డి, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తెలంగాణ నాయి బ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం అధ్యక్షుడు మహేందర్ నాయి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను బీసీ సంక్షేమ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి మెమోరాండం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ సంక్షేమ పథకాలను జిల్లా నాయి బ్రాహ్మణులకు అందించేలా సహకారలు ఉండాలని కోరారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందిస్తూ జిల్లా నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలన్నీటిని అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు మహేందర్ నాయి, కార్యదర్శి రవీందర్ నాయి,తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్లం నాయి, ఉపాధ్యక్షుడు నాందేవ్ నాయి, స్వామి రాజు నాయి, బాలకిషన్ నాయి, రాజు నాయి, బాబు నాయి, నర్సింలు నాయి, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.