రెంజల్, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ఏపిడి మధుసూదన్ అన్నారు.శుక్రవారం మండలంలోని బొర్గం, అంబేద్కర్ నగర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీపీఎం సాయిలు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఉందని రైతులు అపోహ పడకూడదని లారీల కొరత లేకుండా చూస్తామని ఆయన అన్నారు.
బొర్గం గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రంలో లారీల కొరత ఉందని రైతులు తెలపడంతో రెండు లారీలను పంపించడం జరిగిందని అన్నారు.రైతులు అపోహలు నమ్మకూడదని రైతులు పండిరచిన ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోన్నే విక్రయించుకుని అధిక లాభాలు ఆర్జించాలని అన్నారు.ఆయన వెంట ఏపీఎం చిన్నయ్య,సీసీ కృష్ణ,తస్లిమ్ తదితరులు ఉన్నారు.