కామారెడ్డి, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం సమీపంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున సేమియాను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని తెలిపారు.
మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. సర్వమత సౌబ్రాతృత్వానికి మైనార్టీల జీవితాల్లో ఈ పండుగ ఆనందం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజిబుద్దీన్ కు కలెక్టరు, ఎస్పి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్‌కు కలెక్టరు, ఎస్పి రంజాన్ పండగ శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ వెంకట్ రావు, అధికారులు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.