కామారెడ్డి, ఏప్రిల్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మీ (28) గర్భిణీ స్త్రీ అనీమియాతో బాధపడుతున్నడంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్ రక్తం కుటుంబ సభ్యులలో ఎవరికి లేకపోవడంతో వారు ఐ వి ఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారి మందుల సంతోష్ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో మే 4 వ తేదీన ప్రముఖ సమాజ సేవకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలనుకున్న రక్తదాతలు 9492874006 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
రక్తదానం చేసిన రక్తదాత మందుల సంతోష్ కు ఐవిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టెక్నీషియన్లు చందన్, ఏసుగౌడ్ పాల్గొన్నారు.