నిజామాబాద్, ఏప్రిల్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న లిప్రజావాణిలి కార్యక్రమాన్ని తాత్కాలికంగా లివాయిదాలి వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 24న సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్ బృందం జిల్లా పర్యటనకు విచ్చేస్తోందని, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్ లో అధికారులతో సమీక్ష, సెమినార్ కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. మహిళా కమిషన్ పర్యటన దృష్ట్యా సోమవారం రోజున జరగాల్సిన లిప్రజావాణిలి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.