Daily Archives: April 25, 2023

దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు తెలియజేయునదేమనగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2022-2023 ఆర్ధిక సంవత్సరమునకు శారీరక వైకల్యం గల వారికి, బదిరులకు, అందులకు, మానసిక దివ్యాంగుల సహాయార్థం కింద తెలిపిన సహాయ ఉపకరణములను ఉచితముగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు కామారెడ్డి జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, …

Read More »

పెరిగిన హమాలీ చార్జీలపై సమీక్ష

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలో 40 కేజీల దాన్యం బస్తాకు రూ.15 హమాలీ చార్జి ఉందని ప్రస్తుతం రూ. 16.50 కి పెంచారని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. మార్కెటింగ్‌, ఐకెపి, సహకార అధికారులతో మంగళవారం కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం పెరిగిన హమాలి చార్జీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 50 కేజీల బస్తాకు గతంలో …

Read More »

దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మలేరియా వ్యాధిని నిర్మూలించడానికి సమయం ఆసన్నమైనదని, ఆవిష్కరణలను ఉపయోగించుకుంటూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 2030 నాటికి మలేరియా అంతానికి మనమందరం కంకణబద్ధులం కావాలని నిజామాబాదు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ సుదర్శనం మంగళవారం ప్రపంచ మలేరియా దినం ర్యాలీని స్థానిక చంద్రశేఖర్‌ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జండా ఊపి ప్రారంభించారు. జిల్లా …

Read More »

ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ హైదరాబాద్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియం, నాగారంలో ఆర్చరీ ఖేలో ఇండియా శిక్షణ శిబిరాన్ని గత సంవత్సరం డిసెంబర్‌ 28 న ప్రారంభించారు. ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని 12-18 మధ్య వయసుగల విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తన్న ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

జిల్లా జైలును సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ బృందం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం మంగళవారం సారంగాపూర్‌ లో గల నిజామాబాద్‌ జిల్లా జైలును సందర్శించారు. జైలులో అండర్‌ ట్రయల్‌ ప్రిజనర్లు, ఖైదీలకు కల్పిస్తున్న వసతి, సదుపాయాలను నిశితంగా పరిశీలించారు. జిల్లా కారాగారంలో అన్ని బ్యారక్‌లు తిరుగుతూ, అండర్‌ ట్రయల్‌ ముద్దాయిలు, వివిధ కేసుల్లో శిక్షపడిన ఖైదీలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »