కామారెడ్డి, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో 40 కేజీల దాన్యం బస్తాకు రూ.15 హమాలీ చార్జి ఉందని ప్రస్తుతం రూ. 16.50 కి పెంచారని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మార్కెటింగ్, ఐకెపి, సహకార అధికారులతో మంగళవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం పెరిగిన హమాలి చార్జీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
50 కేజీల బస్తాకు గతంలో రూ.16.50 ఉండేదని చెప్పారు. ఇప్పుడు రూ.18 కి పెంచారని పేర్కొన్నారు. దడువై రూ.1.80 ఉండగా ప్రస్తుతం రూ.2.25 కు పెంచారు. చాటవాలి గతంలో రూ.1 ఉండగా ఇప్పుడు రూ.1.50 కి పెంచారని చెప్పారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకోసారి హమాలి చార్జీలను పెంచుతారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, ఐకెపిడీపీఎం రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు.