కామరెడ్డి, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవునిపల్లి, రాజంపేట, గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తిమ్మక్ పల్లి, దేవునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలను బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్త చైర్మన్ శ్రీధర్ రెడ్డి తనిఖీ చేపట్టారు. గదులు, మరుగుదొడ్లును పరిశీలించారు.
గ్రీన్ చాక్ బోర్డ్స్, డబుల్ డెస్కులు, పెయింటింగ్స్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డీఈఓ రాజు, డిప్యూటీ ఇంజనీర్ సాయన్న, కామారెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య, ఇంజనీరింగ్ అధికారులు,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.