కామారెడ్డి, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో వనిత (33) అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన బి నెగిటివ్ రక్తం కుటుంబ సభ్యులలో ఎవరికి ఆ రక్త వర్గం లేకపోవడంతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేశ్ మానవ దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని కె బిఎస్ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ మాట్లాడుతూ రక్తదానం పట్ల సమాజంలో ఇప్పటికీ ఎన్నో అపోహలు ఉన్నాయని రక్త దానం చేయడం వలన ఎలాంటి శారీరక బలహీనతలు ఏర్పడవని, రక్తదాతలు ప్రాణదాతలే అని రక్తదానం చేయడానికి యువతి యువకులు ఎల్లప్పుడు ముందుకు రావాలని అన్నారు.
రక్తదానం చేసిన రక్తదాత ఉమేశ్ కు ఐవిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్, కామారెడ్డి రక్తదాతల సమూహ కార్యదర్శి శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.