కామారెడ్డి, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పారదర్శకంగా గొర్రెల కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటీల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయిలో గొర్రెల కొనుగోలు బృందం అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం కింద రెండో విడత గొర్రెల కొనుగోలులో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా అధికారులు చూడాలన్నారు.
లబ్ధిదారులకు నచ్చిన గొర్రెలను కొనుగోలు చేయాలని చెప్పారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, కర్ణాటక లోని తుంకూర్ చిత్రదుర్గ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలలో గొర్రెలను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
గొర్రెల కొనుగోలులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పవర్ ప్రజెంటేషన్ ద్వారా పశు వైద్యాధికారి దేవేందర్ అధికారులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్, జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, దయానంద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.