బోధన్, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, గురుగోవింద్ నగర్ కాలనీలో పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ఇంటింటిని పరిశీలించి సరైన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీలు చేపట్టారు.
అనంతరం కాలనీలో కమ్యునిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. యువత చెడు అలవాట్లకు పాల్పడకుండా ఉండాలన్నారు. ప్రజలందరూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండాలన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీనివాసరాజ్, ఎస్ఐలు పీటర్, నవీన్ గౌడ్, నరేష్, రూరల్ ఎస్ఐ సందీప్ సిబ్బంది ఉన్నారు.