రెంజల్, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మాల మహానాడు మండల యువజన విభాగం అధ్యక్షుడు సిద్ధ సాయిలు చేసిన సేవలను గుర్తించి అంబేద్కర్ జయంతోత్సవాలను పురస్కరించుకుని శనివారం నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూకిరణ్ శేఖర్ చేతుల మీదుగా దళితరత్న అవార్డు అందుకున్నారు. గత దశాబ్ద కాలం నుండి మండలంలో దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను నిర్భయంగా ఎదుర్కొంటున్న నాయకులలో సిద్ధ సాయిలు ముందుంటారు.
2017లో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అట్రాసిటీ కేసును రద్దు పరుస్తామని అనడం, 2022లో రాజ్యాంగాన్ని మారుస్తామని ముఖ్యమంత్రి అన్న అంశాలపై తీవ్రంగా స్పందించారు. నాయకులు, కార్యకర్తలను పోగు చేసి ఆందోళన చేపట్టారు.గ్రామంలో కొంతమంది అగ్రవర్ణ శక్తులు అంబేద్కర్ విగ్రహా ఏర్పాటును వ్యతిరేకించిన మండల నాయకుల సహకారంతో సాయిలు ముందుకు సాగారు.
తనకు దళిత రత్న అవార్డు రావడం అదృష్టంగా భావిస్తున్నానని సిద్ధ సాయిలు అన్నారు. దళిత ప్రజల సమస్యలపై మరింతగా శ్రమిస్తానని చెప్పారు. తన అవార్డు ఎంపికకు కృషి చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్టెపు మోహన్ రావు, జక్కల సంతోష్‌లకు సిద్ధ సాయిలు కృతజ్ఞతలు తెలిపారు.