నిజామాబాద్, ఏప్రిల్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన్ కీ బాత్ 100 ఎపిసోడ్స్ 100 పుస్తకాలతో సమానమని, ఈ 100 ఎపిసోడ్స్‌లో ప్రధానమంత్రి చెప్పిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ అన్నారు. నాగారంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.
100 ఎపిసోడ్స్‌లో ఎన్నో గొప్ప విషయాలను, మనకి తెలియని మహాపురుషులను వాళ్ళ చరిత్రను మనకి పరిచయం చేశారని, ఏ ఒక్క ఎపిసోడ్‌లో కూడా రాజకీయాలు మాట్లాడలేదని, పీపుల్స్ పద్మ అవార్డులు, స్వచ్చ భారత్, ఫిట్ ఇండియా, యోగా దినోత్సవం లాంటి ఎన్నో విశేషాలను దేశ ప్రజలకు పరిచయం చేశారని ఇలాంటి మన్ కీ బాత్‌లు మరెన్నో ఎపిసోడ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. వంద ఎపిసోడ్స్ వినని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వాటిని వినాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.