కామారెడ్డి, మే 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గీతా పారిశ్రామిక సహకార సంఘం కామారెడ్డి మండల, పట్టణ కమిటీలా కార్యవర్గాలను సోమవారం జిల్లా గౌరవ అధ్యక్షులు మోతే బాలరాజు గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గోపి గౌడ్, హరికృష్ణ గౌడ్, వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పట్టణ గౌరవ సలహాదారులుగా పోచగౌడ్, సీసల నారాగౌడ్, అధ్యక్షులుగా ఉప్పల్ వాయి గోపిగౌడ్, ఉపాధ్యక్షులుగా సేర్ల సాయగౌడ్, కోలల సిద్దాగౌడ్, రామగొని రాజేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కంచర్ల నర్సాగౌడ్, కార్యవర్గ సభ్యులుగా దేవాగౌడ్, శ్రీకాంత్ గౌడ్, పెంటాగౌడ్, శివరాజా గౌడ్, నర్సాగౌడ్, రామగౌడ్, రమేష్ గౌడ్, గరిగే నర్సాగౌడ్, సాయి కృష్ణ గౌడ్, కామారెడ్డి రమేష్ గౌడ్ ఎన్నికయ్యారు.
మండల గౌరవ అధ్యక్షులుగా అబ్బగౌని బాలకిషన్ గౌడ్, అధ్యక్షులుగా తాటిపాముల నర్సాగౌడ్, ఉపాధ్యక్షులుగా రావుల రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కదిరే సాగర్ గౌడ్, సంయుక్త కార్యదర్శి గా గరిగే గణేష్ గౌడ్, కోశాధికారిగా తలమడ్ల దుర్గా గౌడ్, కార్యవర్గ సభ్యులుగా శంకర్ గౌడ్ స్వామి గౌడ్ మోగుళ్ల సాయా గౌడ్, కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నర్సాగౌడ్, మహేందర్ గౌడ్, మహేష్ గౌడ్, నారాగౌడ్, సిద్ధ గౌడ్, స్వామిగౌడ్, రంజిత్ గౌడ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సర్పంచులు రవితేజ గౌడ్, సాగర్ గౌడ్, విండో వైస్ చైర్మన్ శంకర్ గౌడ్, కిషన్ గౌడ్, రాజాగౌడ్, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.