రెంజల్, మే 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి లను వెంటనే రెగ్యులర్ చేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులు రాజేశ్వర్, నాగన్న అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె సోమవారానికి మూడో రోజుకు చేరడంతో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేయడంతో వారికి మద్దతుగా సిపిఎంఎల్ ప్రజాపంథా నాయకులు సమ్మెల కూర్చొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధుల్లో చేర్చుకునే ముందు మూడు సంవత్సరాల్లో గెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తయిన కూడా రెగ్యులరైజ్ చేయకపోవడం సరైన పద్ధతి కాదని ఇచ్చిన మట ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్న సమ్మె ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడం కోసం సమ్మె ద్వారా తమ ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారాని ప్రభుత్వం స్పందించేంతవరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు.
కార్యక్రమంలో ప్రజపంథా నాయకులు ఒడ్డెన్న, నసీర్, పెద్దలు, పంచాయతీ కార్యదర్శులు సాయిలు, సాయిబాబా, నవీన్, మహబూబ్ అలీ, కృష్ణ, రజినీ, గౌతమి, రోజా, రాణి, అమ్రిన్ తదితరులు ఉన్నారు.