రెంజల్, మే 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హక్కులను సాధించాలంటే పోరాటాల ద్వారానే సాధ్యం అవుతాయని చికాగో కార్మికులు నిరూపించారని కార్మిక అమరుల స్ఫూర్తితో పోరాడి ఎన్నో చట్టాలను సాధించుకున్నామని సీపీఐఎంఎల్ ప్రజపంథా జిల్లా నాయకులు పార్వతి రాజేశ్వర్, పెద్దులు అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం ప్రపంచ కార్మికుల దినం మేడేను పురస్కరించుకుని కార్మికుల జెండా ఎగురవేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికైనా సమసమాజం ఏర్పడాలంటే సోషలిస్టు వ్యవస్థ మార్గమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ ఉపాధి భద్రత లేకుండా చేస్తున్నారని, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజపంథా నాయకులు ఒడ్డెన్న, నసీర్, నాగన్న, సాయిలు, గంగాధర్, వివిధ పార్టీల నాయకులు మౌలానా, సాయరెడ్డి, నర్సయ్య, అబ్బన్న, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.