రెంజల్, మే 2
నిజామాబాదు న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లిడంతో భారీ ఎత్తున నష్టపోయారని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు.
మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25,000 నష్టపరిహారం చెల్లించి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం చేస్తుంది తప్ప ఆచరణలో పెట్టి అమలుపరుస్తున్న దాఖలాలు లేవని వారం రోజుల నుండి ప్రకృతి రైతాంగాన్ని వెంటాడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యం నీట మునిగి రైతాంగానికి తీరని నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పంట నష్టం జరిగిన రైతుల వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూసిన పాపన లేదని మండిపడ్డారు.
అనంతరం తాహసిల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుక్క రాజు, ఎంపీపీ లోలపు రజనీ కిషోర్, జడ్పీటీసీ మేక విజయసంతోష్, వైస్ ఎంపీపీ క్యాతం యోగేష్, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కూరేళ్ల శ్రీధర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, పోచయ్య, మాజీ మండల అధ్యక్షులు సంతోష్, కిషోర్, బిజెవైయం మండల ఉపాధ్యక్షుడు గోపికృష్ణ, ప్రసాద్, నాగనాథ్ పటేల్, శుభమ్, నాగోజీ, నర్సారెడ్డి, గోపాల్ రెడ్డి, రమేష్, సాయినాథ్, శివ, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.