ఎడపల్లి, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన బిఆరెస్ సర్పంచ్ కోలా ఇంద్ర కరణ్ నిజామాబాదు ఎంపీ అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. సర్పంచ్‌తో పాటు పలువురు పోచారం గ్రామ యువకులు బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరగా వారికి ఎంపీ అరవింద్ పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ… బీజేపీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి సాధ్యమని భావించిన ప్రజలు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. దొరల పాలన అంటే ఎలా ఉంటుందో ఈ తరానికి ప్రత్యక్షంగా చూపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, కేసీఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పేరుతో తన కుటుంబ సభ్యులకు వందల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు.
ఎనిమిదేళ్ల కేసిఆర్ పాలన దొరల పాలనను తలపించిందని, బీఆర్ఎస్ పార్టీలో విసుగెత్తిన ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసేందుకే బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బిజెపి కార్యదర్శి మాసోజు సుధాకర్ చారి, ఎడపల్లి మండల అధ్యక్షులు మోపాల్ కమలాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు సురేష్ పాల్గొనగా గ్రామానికి చెందిన యువకులు జక్కు శ్రీకాంత్, డైరీ నవీన్ గౌడ్, కోలా కరుణాకర్, శ్యామల శివకుమార్ వీరందరినీ పార్టీ కోసం సమయం ఇచ్చి పనిచేయాలని ఎంపీ తెలిపారు.