కామారెడ్డి, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజంపేట్ మండల తలమడ్ల గ్రామానికి చెందిన సత్తవ్వ (78)కి అత్యవసరంగా మరీ అతితక్కువ మందిలో ఉండే ఏబి నెగెటివ్ రక్తం రెండు యూనిట్లు అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు.
గిద్ద గ్రామానికి చెందిన సంతోష్, భిక్నూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి సహకారంతో వారికి కావలసిన రెండు యూనిట్ల ఏబి నెగటివ్ రక్తం అందజేశారు. ఒక్క ఫోన్ చేయగానే స్పందించి రక్తధానం చేసిన రక్తదాతలకు జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్ బ్లడ్ సెంటర్ టెక్నీషియన్లు చందన్, యేసుగౌడ్ పాల్గొన్నారు.