కామారెడ్డి, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా పలు హోటల్స్, టిఫిన్ సెంటర్‌లపైన తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత తెలిపారు.
ప్రతి ఫుడ్ సెంటర్ కు సంబందించిన వ్యాపారులు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేని వారికి 5 లక్షలు జరిమాన విదించబడునని, అలాగే 6 నెలల జైలు శిక్ష విదిస్తామన్నారు. పరిశుభ్రత పాటించని హోటల్స్ కు, టిఫిన్ సెంటర్‌లకు నోటీసులు జారీచేసినట్లు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా కేంద్రం లో 14 కేసులు చేసినట్లు తెలిపారు. గత నెలలో రెస్టారెంట్, హోటల్ నిర్వాహకులకు మెయింటెయిన్ చేసే విధానంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.