తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే మద్దతు ధర కల్పించాలి

రెంజల్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తడిసి ముద్దయి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కోశాధికారి, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని దూపల్లి, వీరన్న గుట్ట, రెంజల్‌, సాటాపూర్‌ గ్రామాలలో తడిసి ముద్దయిన ధాన్యపురాసులు, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు.

గ్రామాలలో మొలకెత్తిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని రైతులు తీసుకొచ్చి చూపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పండిరచిన దాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దాయి అష్ట కష్టాలు పడుతున్న రైతాంగం గోస పట్టించుకునేనాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు ఆఫీసులలో కాకుండా రైతాంగపు సమస్యలను పరిశీలించాలని సుదర్శన్‌ రెడ్డి సూచించారు. కనీసం ప్రభుత్వం కూడా అధికారులను ఆదేశించకపోవడం సిగ్గుచేటు అన్నారు.రైతాంగాన్ని ఆదుకోకపోతే ప్రజల బతుకు తెరువు కష్టమవుతుందని చెప్పారు.

నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. కొంతమంది దళారులు రైతుల అవకాశాన్ని అనువుగా తీసుకొని కిలోలా కొద్దీ తరుగు తీసుకుంటూ నిలువ దోపిడీకి పాల్పడుతున్నారని,అలాంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వం స్పందించాలని అన్నారు.

ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచుల రాములు, డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి జావేదోద్దీన్‌, మండల ఉపాధ్యక్షులు గంగాకృష్ణ, గయాసోద్దీన్‌, మండల నాయకులు అమ్రాద్‌ శేఖర్‌, కురుమ శ్రీనివాస్‌, సిద్ధ సాయిలు, పోచయ్య, గోసుల శ్రీనివాస్‌ శంషోద్దీన్‌, ఏ వన్‌, సద్దాం, రాకేష్‌ రైతులు ఉన్నారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »