కామారెడ్డి, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. తడిచిన ధాన్యాన్ని చూశారు. ఆరబెట్టిన ధాన్యాన్ని శుభ్రపరచి కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచించారు.
రైతులు తమ ధాన్యాన్ని వర్షాల నుంచి కాపాడుకోవాలని పేర్కొన్నారు. కుప్పలపై టార్పాలిన్ కవర్లు చెప్పాలని తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారిని వసంత, అధికారులు పాల్గొన్నారు.