ఆర్మూర్, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐకేపి వివోఏ ల సమ్మె 11వ రోజుకు చేరింది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్థ సమీపంలో తలపెట్టిన సమ్మె గురువారంతో 11 వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
గత 20 యేండ్లుగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం తాను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. వర్కింగ్ అధ్యక్షుడు నర్సాగౌడ్ మాట్లాడుతూ వివోఏలకు కనీసం గౌరవ వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలనీ, అలాగే 10 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కలిపించాలని, జిఓ నెంబర్ 58 ను సవరిస్తూ అనుబంధం 5ను రద్దు చేసి మూడు సంవత్సరాలకు ఒక్కసారి రినివల్ చేయాలని, మొత్తం 17 న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో అధ్యక్షురాలు సువర్ణ, ఉపాధ్యక్షురాలు జ్యోతి, కార్యదర్శి రేఖ, సహాయకార్యదర్శి సర్దా సంతోష తదితరులు పాల్గొన్నారు.