ఆర్మూర్, మే 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ మున్సిపాలిటి పరిధిలోని మామిడి పల్లిలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 14 అడుగుల విగ్రహ ఆవిష్కరణ మే 7 సాయంత్రం 6 గంటలకు ఆర్మూర్ మామిడిపల్లిలో ఉంటుందని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, నిర్వాహకులు తెలిపారు. విగ్రహావిష్కరణ సభలో ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, ఉన్నత ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.సరిత పాల్గొంటారని వారు తెలిపారు.
సభలో వక్తలుగా ఇ. పోచన్న టీపీటీఎఫ్, డాక్టర్ మధుశేఖర్, డాక్టర్ అశోక్, ఆర్మూర్ ఎంపీపీ పస్క నరసయ్య, ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ వినిత పవన్ పాల్గొంటారని వారు తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మెడిదాల రవిగౌడ్, కాశీరాం, ఆకుల రాము, రాజ గంగారం, నర్సారెడ్డి, విగ్రహ దాత దినేష్, మామిడిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు, గ్రామంలోని యువజన సంఘాల ప్రతినిధులు, వివిధ గ్రామాలకు సంబంధించిన అంబేద్కర్ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని వారు వివరించారు.
సభ నిర్వాణ దాసు, అధ్యక్షత ఎస్.అఖిల్‌లు వ్యవహరిస్తారని వారు తెలిపారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, సభకు వచ్చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలకు భొజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి వల్ల దేశంలో ఉన్న దళిత బహుజనులు అనేక హక్కులు పొందారని, విద్యా ఉద్యోగ రంగంలో ముందడుగు వేయడానికి దోహద పడిరదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.