ఆర్మూర్, మే 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన ఓ దిన పత్రికలో పని చేస్తున్న వడ్ల తిరుపతిని నవనాథపురం ప్రెస్‌క్లబ్ సభ్యులు గత నాలుగు రోజుల క్రితం గాయమైన విషయాన్ని తెలుసుకొని శనివారం ఆయనను పరిమర్శించారు.
పరామర్శించిన వారిలో గౌరవ అధ్యక్షుడు సత్పుతే శ్రీనివాస్, అధ్యక్షుడు సుంకరి గంగమోహన్, ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్దేమ్, సలహాదారుడు కొడిమ్యాల గణేష్ గౌడ్, సభ్యులు మాజీ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్, అమృతల శ్రవణ్, గోజుర్ మహిపాల్, యమ్మాజీ చరణ్ గౌడ్, గోలి పురుషోత్తం, ముద్రకోలా వినోద్, గటడి అరుణ్, అయ్యాడి సురేష్, వెంకటేష్ గుప్తా, జక్కా రమణయ్య, పి ముకేశ్, ఎమ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.