ఆర్మూర్, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో గల తాజ్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఆదివాసి నాయకపోడ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి బొజన్న ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం జిల్లా సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఆదివాసి నాయకపొడ్ కమిటి ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షునిగా ఆలూరు గ్రామానికి చెందిన గాండ్ల రామచందర్ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా ముప్కాల్ మండలం నల్లూరు గ్రామానికి చెందిన దేగాం సాయన్న, జిల్లా కోశాధికారిగా నిజామాబాద్‌కు చెందిన శానం పవన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ముప్కాల్ మండల్ వేంపల్లి గ్రామానికి చెందిన లోలం గంగాధర్ ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షునిగా ఎన్నికైన గాండ్ల రామచంద్ర మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఆదివాసి నాయకపోడు కులస్తులందరినీ ఏకం చేసి కులసంఘ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని జిల్లాలో ఉన్న నాయకపోడు కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. జిల్లాలో ఉన్న కులస్తులందరితో మమేకమై చేదోడువాదోడుగా ఉంటూ వారి అభివృద్ధిలో పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లాలో ఉన్న వివిధ గ్రామాల ఆదివాసి నాయకపొడ్ కుల సభ్యులు పాల్గొన్నారు.