కామారెడ్డి, మే 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కంటి వెలుగు కేంద్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి చంద్రశేఖర్, కౌన్సిలర్ వనిత, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.