డిచ్‌పల్లి, మే 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని కామారెడ్డి, నిజామాబాదు జిల్లాల డిగ్రీ కళాశాలలకు మే 10 నుండి మే 31 వరకు వేసవిసెలవులు ప్రకటించాలని టీజీ సిటిఏ, టీజీ జిసిటిఏ, సంఘాల అధ్యాపకులు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్త్రార్ ప్రొఫెసర్ యాదగిరికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పరీక్షల ఎవల్యూషన్ రెమ్యూనరేషన్ కూడా పెంచాలని, ఎన్సిసి సబ్జెక్టును ఎలక్టివ్‌గా అమలుపరచాలని, పరీక్షల నిర్వహణ ఖర్చులు కూడా అధికం అవుతున్నందున వాటిని పెంచాలని కోరారు.
ఈ అంశాల పట్ల విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ యాదగిరి, పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ అరుణ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నుండి కార్యదర్శులు లెఫ్టినెంట్, డా.ఎం. రామస్వామి, జే. శివకుమార్, ఎం. చంద్రకాంత్, ఎన్.రాములు నిజామాబాదు నుండి కార్యదర్శులు డా.దండు స్వామి, డా. ఎస్. సురేష్, డా.ఎన్. అంబర్ సింగ్, డా. తోసెఫ్, వరప్రసాద్, డా. వేణు ప్రసాద్, లెఫ్టినెంట్, బాబురావు, డా. జి. లింగన్న, ఈసి మెంబెర్స్, డా. టి. పెద్దన్న, టియు సెక్రెటరీ ఏ. రాజేష్, పాల్గొన్నారు.