రెంజల్, మే 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇంచార్జి సిపి చల్లా ప్రవీణ్ కుమార్ అన్నారు.రెంజల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నిజామాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ చల్లా ప్రవీణ్ కుమార్,ఏసీపీ కిరణ్ కుమార్,సర్పంచ్‌ల ఫోరమ్ మండల అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్‌లతో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ చల్లా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.రెంజల్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు తమ తమ గ్రామలలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఒక్కొక్క సీసీ కెమెరా వంద మంది తో సమానమని ముఖ్యంగా గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే సీసీ కెమెరాల ద్వారా గుర్తించడం సాధ్యమవుతుందని అలాగే నేరనియంత్రణకు సీసీ కెమెరాలద్వారా అరికట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
అనంతరం సీపీ చల్లా ప్రవీణ్ కుమార్, ఏసీపీ కిరణ్ కుమార్,సీఐ శ్రీనివాస్ రాజ్‌లను సర్పంచ్‌ల ఫోరమ్ మండల అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎస్సై సాయన్న, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, నాయకులు కిషోర్, రఫిక్, అసాని అనిల్, సాయగౌడ్, నారాయణ తదితరులు ఉన్నారు.