ఆర్మూర్, మే 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలను యల్లారములు మెమోరియల్ హల్లో బుధవారం నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా గణేష్ గౌడ్, కార్యదర్శిగా సందీప్, కోశాధికారిగా అమృతల శ్రావణ్లను ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం సీనియర్ పాత్రికేయులు నూతన అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు గణేష్ గౌడ్, సందీప్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని, తమకు సహకరించిన సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, జనగౌడ్, శ్రీనివాస్, జనార్ధన్, ప్రశాంత్, దేశెట్టి సునీల్, చిరంజీవి, రాజేష్, రాంపూర్ శ్రవణ్, రితీష్, చేతన్, అజీమ్, తదితరులు ఉన్నారు.