నిజామాబాద్, మే 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోస్రా శివారులోని సర్వే నెం. 952 పరిధిలో గల స్థలాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఇతర రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో కలిసి మ్యాప్‌లు, రికార్డుల ఆధారంగా అటవీ, రెవెన్యూ సరిహద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.
పలువురు రైతులు పంటలు సాగు చేస్తున్న భూములను సందర్శించి, అవి పట్టా భూములేనా లేక రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయా? అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, మ్యాప్‌ల ఆధారంగా క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే జరిపి నివేదిక అందించాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డీ శ్యామ్ సుందర్ రెడ్డికి సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.