కామారెడ్డి, మే 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనుత్తీర్ణత పొందినవారు అసంతృప్తికి లోను కావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కలెక్టర్ మాట్లాడారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అనుతీర్ణత పొందిన విద్యార్థులకు జీవితంలో ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి రెండవసారి ప్రయత్నంలో విజయం సాధించవచ్చుని చెప్పారు.
విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, వారిని తల్లిదండ్రులు తక్కువ అంచనా వేయకూడదని సూచించారు. తాను కూడా ఐఏఎస్ మొదటి ప్రయత్నంలో అను ఉత్తీర్ణత పొందినట్లు చెప్పారు. రెండవ ప్రయత్నంలో ఐఏఎస్ ఉత్తీర్ణత సాధించి కలెక్టర్ అయ్యానని పేర్కొన్నారు.