కామారెడ్డి, మే 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ సూచనల మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , అడిషినల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే వయోవృద్ధుల పోషణ ఫిర్యాదుల వెబ్ పోర్టల్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నిరాదరణకు గురైన తల్లి దండ్రులు లేదా వయోవృద్ధుల పోషణ సంరక్షణ చూసుకొని పిల్లలపై ఆన్లైన్ లో సినియర్ సిటిజన్ మెయింటెనెన్స్ కేసెస్ మోనిటరింగ్ సిస్టం వెబ్ పోర్టల్‌లో పిర్యాదు చేయాలని చెప్పారు.
వయోవృద్ధులు మొబైల్ ఫోన్, ఆన్లైన్ కేంద్రాల ద్వారా ఈ వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ కలెక్టర్‌కు ఫిర్యాదులు నమోదు చేసుకునే వీలుందన్నారు. ఈ వెబ్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులు ఈ మోడలింగ్ సిస్టం ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని చెప్పారు. వయో వృద్దులు పిర్యాదులు నమోదు చేసే విధానంలో ఇబ్బంది ఉంటే వయోవృద్ధుల హెల్ప్ లైన్ 14567 ని సంప్రదించాలని జిల్లా సంక్షేమ అధికారిణి పి.రమ్య తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రమ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నరేష్ పాల్గొన్నారు.