రెంజల్, మే 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 7న మండలంలోని కునేపల్లి గ్రామంలో ప్రారంభించారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని సర్పంచ్ రొడ్డ విజయలింగం తెలిపారు.
గురువారం నాటికి గ్రామంలో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమం ముగియడంతో విధులు నిర్వహించిన వైద్యులతోపాటు వైద్యసిబ్బందికి సర్పంచ్ రొడ్డ విజయలింగం శాలువా, పులమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం లు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.