కామారెడ్డి, మే 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లర్లు మిల్లింగ్ చేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం రైస్ మిల్లర్లతో ధాన్యం మిల్లింగ్ లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
రైస్ మిల్ యజమానులు లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేపట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిఎస్‌ఓ పద్మ, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, అధికారులు, రైస్ మిల్ యజమానులు పాల్గొన్నారు.