కామారెడ్డి, మే 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీటీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ సౌకర్యం వంటి సౌకర్యాల కోసం ప్రతిపాదనలను అధికారులు తయారుచేసి ఉన్నతాధికారులకు పంపాలని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, టిపిఓ గిరిధర్, ఆర్‌అండ్‌బి డిఈ శ్రీనివాస్, మున్సిపాలిటీ డిఈ వాసుదేవ రెడ్డి, రాజీవ్ స్వగృహ ఏజీఎం సత్యనారాయణ, పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, తహసిల్దార్ వెంకట్ రావు , అధికారులు పాల్గొన్నారు.