కామారెడ్డి, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలల వసతి గృహాల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్ సరఫరా కోసం బహిరంగ వేలం నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో వసతి గృహాల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు, కోడి మాంసం సరపరా చేయడానికి కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం బహిరంగ వేలం చేపట్టారు.
కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్, ఉమ్మడి జిల్లా రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ బషీర్, మైనార్టీ కళాశాలలో ప్రిన్సిపాల్లు, వేలంపాటదారులు, అధికారులు పాల్గొన్నారు.