నిజామాబాద్, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 సెప్టెంబర్ 9న సిరికొండ పోలీసు స్టేషన్లో ఏఎస్ఐగా విదులు నిర్వహిస్తున్న ఎస్.కె. భాషా రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మరణించారు. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సెన్స్ రూపంలో గల చెక్కు ఐదు లక్షల రూపాయలను శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా మృతుడు ఎస్.కె. భాషా సతీమణి గౌసియా బేగంకి చెక్కు అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) జి. మధుసుదన్ రావు, నిజామాబాద్ పరిపాలన అధికారి (ఎ.ఓ) బి. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఆఫీస్ సూపరింటెండెంటు మక్సూద్ హైమద్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, భద్రతా సెక్షన్ ఇంచార్జీ పి. రాజేశ్వర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.