కామారెడ్డి, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో సురేఖ (24) గర్భిణికి అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో రెడ్డి పేట గ్రామానికి చెందిన రక్తదాత బుర్రి ప్రశాంత్ గౌడ్ సకాలంలో 5వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నాడు అతి కొద్ది మందితో ప్రారంభించిన సమూహం నేడు వేలాది మందికి చేరుకుందని, ఇప్పటివరకు 16 వేల యూనిట్ల పైగా రక్తాన్ని ఆపదలో ఉన్న వారికి అందజేయడం జరిగిందని, గడిచిన 6 నెలల్లోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 1073 యూనిట్ల రక్తాన్ని అందజేసి రికార్డును సృష్టించడం జరిగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్తదాతల సమూహం మరియు ఐవీఎఫ్ రక్తదాతల సమూహం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన వారికి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం జరుగుతుందని రక్తదానం చేయడానికి రక్త దాతలు ముందుకు రావాలన్నారు రక్తదానం చేయాలనుకున్నవారు వారి వివరాలను 9492874006 నంబర్ కి పంపించాలని సూచించారు. రక్తదాత బుర్రి ప్రశాంత్ గౌడ్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు.