కామారెడ్డి, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో మృతిచెందగా వారి కుటుంబాలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున నలుగురికి 8 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పార్టీ పరంగా కార్యకర్తలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారన్నారు.
పార్టీ పరంగా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులను పార్టీ చెల్లిస్తుందన్నారు. ప్రమాదంలో చనిపోతే వెంటనే వివరాలను రెండు నెలల్లో పార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు. పెద్ద మల్లారెడ్డికి చెందిన కంఠం బాలయ్య, జంగంపల్లి చెందిన ముడుగుల స్వామి, భిక్కనూరుకు చెందిన భవానిపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డిలు మృతిచెందగా మమత, పద్మ, నర్శవ్వ, దివ్యలకు చెక్కులను అందజేశారు.