రెంజల్, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయమని దేశంలో ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు మొబీన్ ఖాన్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని పార్టీ అవలంబిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు పేద, సామాన్య ప్రజలకు ధనికులకు మధ్య జరిగిన పోరాటమని 2023-24లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఇదే ప్రభావం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై నమ్మకాన్ని కోల్పోయి, కాంగ్రెస్ ప్రభంజాన్ని సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచుల రాములు, డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు సాయిబాబా గౌడ్, కిసాన్ కేత్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎల్ రాజు, మండల నాయకులు నీరడి సాయిలు, గంగాకృష్ణ, అమ్రాద్ శేఖర్, గయాసోద్దీన్, కార్తిక్, శ్రీనివాస్, సిద్ధ సాయిలు, గైనకిరణ్, శంషోద్దీన్, లోక కృష్ణ, రాకేష్, కంఠం గంగారాం, సద్దాం తదితరులు ఉన్నారు.