కామారెడ్డి, మే 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన పుర్ర స్రవంతి (18) అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా అమ్మాయికి అత్యవసరంగా మూడు యూనిట్ల రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు, ప్రవీణ్, రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజులు మానవత దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేశారని ఐవీఎఫ్ సేవా తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు, డాక్టర్ వేదప్రకాశ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళ ప్రాణాలను కాపాడడం కోసం రక్తదానానికి యువకులు ముందుకు రావడం అభినందనీయమని, అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని వేసవికాలం కావడంతో రక్తనిధి కేంద్రాలలో రక్తం లభించడం లేదని, మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానానికి ముందుకు రావాలన్నారు.
రక్తదానం చేయాలనుకున్న యువకులు 9492874006 నెంబర్ కి సంప్రదించాలన్నారు. రక్తదాతలకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు.