రెంజల్, మే 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం దళితరత్న అవార్డుల ఎంపికకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన ఎస్సీ,ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఉపాధ్యక్షుడు నీరడి రవికుమార్, కూనేపల్లి గ్రామానికి చెందిన దళిత నాయకుడు రోడ్ల లింగం, మాల మహానాడు యూత్ మండల అధ్యక్షుడు సిద్ధ సాయిలును ఎంపిక చేసి హైదరాబాదు నగరంలోని రవీంద్ర భారతిలో సత్కరించారు.
తాజాగా సోమవారం మండలంలోని బోర్గం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెడ్ క్రాస్ డివిజన్ ఉపాధ్యక్షులు అశ్వక్ అహ్మద్,స్థానిక సర్పంచ్ వాణి సాయిరెడ్డి ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అశ్వక్ అహ్మద్, స్థానిక సర్పంచ్ వాణిసాయి రెడ్డి మాట్లాడారు.దళిత, గిరిజనుల సమస్యల పట్ల స్పందించే బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పారు. మున్ముందు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇంకెన్నో అవార్డులు పొందాలని వారు ఆకాంక్షించారు. దళిత నాయకుల సేవలను గుర్తించి ప్రభుత్వం దళిత రత్న బిరుదులు ఇవ్వడం సంతోషకరమన్నారు.
సన్మాన కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కల సంతోష్, ఉపసర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి ఫేరోజోద్దీన్,బిఆర్‌ఎస్ మండల నాయకుడు పార్థసాయిరెడ్డి, యువజన కాంగ్రెస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కార్తిక్ యాదవ్,కురుమ సంఘం మండల అధ్యక్షుడు కురుమ సాయిలు, మాల మహానాడు ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు సిద్ధ ప్రభాకర్, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు పార్దా రాజు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల ఇంచార్జ్ లోక కృష్ణ, మాల మహానాడు యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గైని కిరణ్, పంచాయతీ కార్యదర్శి సుమన్,గ్రామస్తులు హిదాయిత్ బేగ్, సిద్ధ పోశెట్టి, తదితరులు ఉన్నారు.