కామారెడ్డి, మే 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండల కేంద్రంలోని శ్యాగ నర్సయ్య తమ కూతురు లక్ష్మి వివాహానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్ గారి సహకారంతో వధువుకు పుస్తె మట్టలు అందించారు.
ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజుగౌడ్ మాట్లాడుతూ గతంలో ఆడబిడ్డల పెళ్లిళ్లు అంటే తల్లిదండ్రులు భయపడే వారని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల వివాహానికి కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఆడపడుచుకు మేనమామ వలే 1,100,16 రూపాయలు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు.
కామారెడ్డి నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ఫలాలు సకాలంలో లబ్ధిదారులకు అందేలా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు పేదలకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వివాహానికి సహాయం చేయమని అడగగానే పుస్తె మట్టలు అందించిన బ్రహ్మంకు, నాగరాజు గౌడ్‌కు వధువు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మండల చైర్మన్ బాశెట్టి నాగేశ్వర్, మండల కో ఆప్షన్ సభ్యులు ఆసిఫ్, వార్డు సభ్యులు వినోద్ కుమార్, గ్రామ రైతు విభాగం అధ్యక్షులు శ్యాగ సిద్దయ్య, భాస్కర్, విజయ్, రాములు తదితరులు పాల్గొన్నారు.