కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయివేటు రంగములో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 19న శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులో గల రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాది కల్పనా కార్యాలయం కామారెడ్డిలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనధికారి బి.పి. …
Read More »Daily Archives: May 16, 2023
పిహెచ్.డి.లపై సమగ్ర విచారణ జరపాలి
డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, ఒకపక్క విసి అక్రమాలు, అవినీతి, విద్యార్థుల దగ్గర డబ్బులు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే మరోవైపు పిహెచ్‌డి స్కాం జరిగిందని, దీనిపై కేవలం ఒక్క విద్యార్థి నాయకుడిపై విచారణ జరపడం సరికాదని తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో …
Read More »లక్ష జరిమానా
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆహార భద్రత శాఖకు సంబంధించి ఆరు కేసులకు గాను ఆహార పదార్థాల విక్రయ వ్యాపారులకు రూ. లక్ష జరిమానను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ విధించారు. ఆహారపు కల్తీకి పాల్పడితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఆహార పదార్థాల విక్రయ వ్యాపారులు కల్తీలేని నాణ్యత కలిగిన ఆహార ప్రదార్థాలు విక్రయించాలని జిల్లా ఆహార …
Read More »జాతీయస్థాయికి ఎదగాలి
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బాన్సువాడ, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన సీఎం క్రీడా పోటీలకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల వల్ల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పారు. …
Read More »విత్తనాల పంపిణీకి ముందస్తు ప్రణాళిక
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డి.జి.పి. అంజనీ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ …
Read More »నకిలీ విత్తనాల చెలామణిని ఉక్కుపాదంతో అణిచివేయాలి
నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి సూచించారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. రాష్ట్ర డీ.జీ.పీ అంజనీకుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం …
Read More »హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో కృషి చేయాలి
నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కులను పరిరక్షించేందుకు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఏ.దేవయ్య అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాలతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ …
Read More »