కామారెడ్డిలో జాబ్‌ మేళా

కామారెడ్డి, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయివేటు రంగములో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 19న శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులో గల రూమ్‌ నెంబర్‌ 121 లోని జిల్లా ఉపాది కల్పనా కార్యాలయం కామారెడ్డిలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనధికారి బి.పి. మధుసూధన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రముఖ వన్‌ కార్డ్‌ బిజినెస్‌ సొల్యూషన్‌ కంపెనీలో టీం లీడర్‌ పోస్టులు -10 మరియు మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు – 30 మార్కెటింగ్‌ మేనేజర్స్‌ – 10 కామారెడ్డి లో ఉన్నాయని, విద్య అర్హతలు ఎస్‌ఎస్‌సి పూర్తిచేసి ఉండాలన్నారు.

అభ్యర్థులకు నెలకు 10 వేల నుండి 40 వేల వరకు వేతనం ఉంటుందని, పోస్ట్‌ల కోసం నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు వయస్సు 19 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలలోపు వారై ఉండాలన్నారు. జాబ్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యే వాళ్ళు బయో డేటాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు, ఫోటోలతో హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 7989019662, 9848237987, 7671974009 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »